మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కోసం మన మోదీ

2024 ఎన్నికల వేళ నమో మంత్రాన్ని మార్మోగిద్దాం

మంది

నమోదు చేసుకున్నారు

ఈ ప్రచార ముఖ్యోద్దేశం

ఈ ప్రచార ముఖ్యోద్దేశం

ఆంధ్ర మరియు తెలంగాణ ప్రగతికి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం అనివార్యం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి శకాన్ని చూశాయి. పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని మన మోదీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా రోడ్లు, రైల్వేలు, సివిల్ వర్క్స్ మరియు విమానయానంతో సహా వివిధ రంగాలలో మౌలిక సదుపాయాలను భారీగా పెంచింది. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల రూపురేఖలను మారుస్తూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు.

మోదీ దార్శనిక స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భారతదేశాన్ని భవిష్యత్ వైపు నడిపించే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల్లో భాగస్వామ్యం కావడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా లభించింది. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి, శ్రేయస్సు వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు ప్రజల అభివృద్ధిలో నూతనోత్సాహాన్ని రగిలిస్తూ, దేశ పౌరులందరికీ ఉజ్వల భవిష్యత్తుకు హామీనిస్తూ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి నిలబడదాం.

మన మోదీ విజయాల మన తెలుగు క్యాలెండర్

ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి మన మోదీ నిరంతరం తోడ్పాటు అందిస్తున్నారు.

  • తెలుగు రాష్ట్రాలకు 4 వందే భారత్ రైళ్ళు
    దక్షిణ భారతంలో రైల్వే కనెక్టివిటీని మరింత పెంచేందుకు వైజాగ్, చెన్నై, తిరుపతి, కాచిగూడ, యశ్వంత్ పూర్ ల మధ్య నేరుగా అనుసంధానం చేసేలా సికింద్రాబాద్ నుంచి 4 వందేభారత్ రైళ్లను ప్రారంభించారు మన ప్రధాని. దీని ద్వారా మౌలిక సదుపాయాల ఆధునీకరణతో పాటు ఆర్థిక అభివృద్ధి జరుగుతోంది.
  • ఆంధ్ర ప్రదేశ్ రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ఫలాలు
    కేంద్ర ప్రభుత్వం గత 6 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రైతులకు మొత్తం రూ.16,085 కోట్లు పంపిణీ చేసింది. దీని ద్వారా 47 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. రాష్ట్రంలోని అన్నదాతలకు ఆర్థిక మద్దతుతో పాటు వ్యవసాయ జీవనోపాధి, గ్రామీణ శ్రేయస్సును ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • అమరావతి - అనంతపురం ఎక్స్ ప్రెస్ వే
    నరేంద్ర మోదీ నాయకత్వంలో రూ.27,635 కోట్ల వ్యయంతో అమరావతి నుండి అనంతపురం ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా గణనీయంగా 120 నిమిషాల ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆరు లేన్ల వెడల్పు, సర్వీస్ రోడ్లతో పాటు, గంటకు 120 మైళ్ల వేగంతో ప్రయాణించే విధంగా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
  • ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎంల నిర్మాణం
    ఏపీలో తిరుపతిలోని ఐఐటీకి రూ.1,074 కోట్లు, విశాఖలోని ఐఐఎం ఏర్పాటుకు రూ.807.76 కోట్లు కేటాయించింది మోదీ ప్రభుత్వం. రూ.438 కోట్లతో తాడేపల్లి గూడెంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్ ) క్యాంపస్ ను ప్రభుత్వం నిర్మించింది. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్రం గట్టిగా కృషి చేస్తోంది.
  • భారత్ మాల ప్రాజెక్టుతో 2520 కి.మీల రహదారి
    భారత్ మాల ఫేజ్ -1 లో భాగంగా శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అంతటా 2520 కి.మీ పొడవైన రహదారులను నిర్మిస్తోంది, వీటిలో 1913 కి.మీల రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా, మరో 607 కి.మీల రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
  • అంధ్ర ప్రదేశ్ అంతటా ఉచిత రేషన్
    'వన్ నేషన్-వన్ రేషన్ కార్డు' కార్యక్రమం ద్వారా ఏపీలోని నిరుపేదలకు నెలకు 23,29,990 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేస్తోంది మోదీ ప్రభుత్వం. వెనుకబడిన వర్గాలకు చెందిన 4.27 కోట్ల మంది దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. అదనంగా రాష్ట్రంలోని 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉచిత రేషన్ను పొందడం ద్వారా మోదీ సర్కారు రాష్ట్ర ప్రజలకు ఆహార భద్రతను అందిస్తోంది.
  • ఏపీ అంతటా ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్లు
    ఉజ్వల యోజన కింద ఆంధ్రప్రదేశ్ కు 5.12 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. మరోవైపు గ్యాస్ సిలిండర్ల ధరను రూ .600 కు తగ్గించడం ద్వారా లబ్ధిదారులకు చౌకగా ఎల్పీజీని అందించడంతో పాటు క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది నరేంద్రుడి సర్కారు.
  • ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ ఫీల్డ్ కారిడార్
    గ్రీన్ ఫీల్డ్ రాయ్ పూర్ - విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ (ఎన్ హెచ్ -130 సిడి & ఇసి -15) నిర్మాణాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది మోదీ నాయకత్వం.ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదగా NHAI ఆమోదించిన ఈ ప్రాజెక్టులో 464 కి.మీల పొడవు, 6 వరుసల యాక్సెస్-నియంత్రిత రహదారి అభివృద్ధి జరగబోతోంది. ఈ కారిడార్ నిర్మాణానికి రూ.20,000 కోట్ల అంచనా వేసింది కేంద్ర ప్రభుత్వం.
  • రామగుండంలో RFCL ఎరువుల కర్మాగారం
    రూ.6,338 కోట్ల పెట్టుబడులతో తెలంగాణ రైతాంగానికి తక్కువ ధరకే ఎరువులు అందించే లక్ష్యం.
  • భాగ్యనగర MMTSపై మోదీ నిబద్ధత
    రూ.1,153 కోట్ల ఖర్చుతో కూడిన ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులకు తన నిబద్ధతకు మించి నిధులు అందించి హైదరాబాద్ పౌరుల సుదీర్ఘ కలను సాకారం చేస్తోంది మోదీ ప్రభుత్వం.
  • రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రైల్ రింగ్ తో విప్లవాత్మక మార్పు
    సుమారు 348 కి.మీ.ల భారీ రీజినల్ రింగ్ రోడ్డు భారీ ప్రాజెక్టుతో తెలంగాణను విజయపథంలో నిలపేందుకు సిద్ధమైంది మోదీ సర్కారు. దీని ద్వారా రవాణా, ఆర్థిక వృద్ధి వంటి ప్రభావాలతో హైదరాబాద్ లో రద్దీని తగ్గించడంతో పాటు జిల్లాల మధ్య అనుసంధానాన్ని పెంచుతుంది.
  • వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ & పీఓహెచ్ వర్క్ షాప్ - కాజీపేట్
    కాజీపేట్ లో సుమారు రూ.521 కోట్లతో నెలకు 200 వ్యాగన్ల మరమ్మతుల సామర్థ్యం కలిగిన పీఓహెచ్ 2024 నాటికి పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా 3,000 వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనాతో ఉంది మోదీ ప్రభుత్వం.
  • దేశంలోనే 100 మెగావాట్ల అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్
    రూ.442.03 కోట్ల పెట్టుబడితో తెలంగాణలోని రామగుండంలో 100 మెగావాట్ల అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం.
  • సమాఖ్యవిధానం మోదీ ప్రభుత్వానికి మూలస్తంభం:
    పన్ను వికేంద్రీకరణను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచడం ద్వారా గత 8ఏళ్ళలో తెలంగాణకు రూ.1.60 లక్షల కోట్లకు పైగా పన్నుల బదలాయింపు జరిగింది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు రూ.8,379 కోట్లు పరిహారం అందేలా చర్యలు తీసుకుంది మోదీ ప్రభుత్వం.
  • మోదీ హయాంలో తెలంగాణకు రూ.5.21 లక్షల కోట్ల నిధులు
    2014 నుండి తెలంగాణ రాష్ట్రంలోని పథకాలు, అభివృద్ధి పనుల కోసం రూ.5.21 లక్షల కోట్లకు పైగా నిధుల్ని మంజూరు చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.
  • ప్రభుత్వ రంగ సంస్థలు, PSUలతో తెలంగాణకు సాధికారత
    2014 నుంచి సుమారు రూ.9.26 లక్షల కోట్ల రుణాల ద్వారా భారత ప్రభుత్వ అండర్ టేకింగ్ లు, PSUల నుంచి తెలంగాణలోని వ్యక్తిగత లబ్ధిదారులకు మద్దతునిచ్చేందుకు ముందడుగు వేసింది మోదీ ప్రభుత్వం

ప్రచారాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేద్దాం

ప్రచారాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేద్దాం

నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వికాస యాత్రలో అందరినీ కలుపుకుపోయేందుకు ఈ లింక్ షేర్ చేయండి.

COPY

వార్తల్లో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు

నరేంద్ర మోదీపై ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజల వాణి

  • ఒకప్పుడు రోడ్డు ప్రయాణమంటే హడలెత్తిపోయే స్థితి నుండి దేశ ప్రగతిని మార్చే రాచబాటలుగా రహదారుల్ని అభివృద్ది చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే. గ్రామీణ ప్రాంతాలను నగరాలతో అనుసంధానించి దేశ అభివృద్దిలో అందరినీ భాగస్వాములను చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ గారిదే

    - విజయ్ చందర్, జహీరాబాద్

  • అనారోగ్యం బారిన పడితే ఆశలు వదిలేసుకునే వాళ్లం ఇదివరకు, కానీ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ తో సామాన్యుడు ఏ చింతా లేకుండా ఉంటున్నాడు. ఈరోజు నా బిడ్డ అనారోగ్యం నుండి కోలుకుని మేమంతా ఇలా ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం, సామాన్యుడి కష్టాలు అర్ధం చేసుకొని వాటిని పరిష్కరించగలిగే నాయకుడిగా శ్రీ నరేంద్ర మోదీ గారు ఉండడం వల్లే సాధ్యమైంది

    - కోల లలిత, విశాఖపట్నం

  • రైతుని రాజుగా చేస్తామంటూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి కానీ అవన్నీ మాటల వరకే పరిమితమయ్యాయి. అన్నదాతల అవసరాలు, సాదక బాధకాలు తెలుసుకొని వాటిని తీరుస్తున్నది నరేంద్ర మోదీ మాత్రమే.. అందుకే మోదీ మా వాడు అయ్యాడు.. ప్రతీ రైతు మన మోదీ అంటున్నాడు

    - సాయన్న, మెట్ పల్లి

  • వేగం, భద్రత, ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవం.. దిగ్గజ దేశాలకి ఏ మాత్రం తీసిపోని విధంగా మన రైల్వేలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినందుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

    - రాజ్ కుమార్, హన్మకొండ

  • గత ప్రభుత్వాల పాలన చూశాక, మన దేశంలో కూడా బుల్లెట్ ట్రైన్ వంటివి ఇంత త్వరగా పరుగులు పెడతాయని నేను ఏ రోజు ఊహించలేదు. కానీ ఊహాలకందని రీతిలో ప్రధాని నరేంద్రమోదీ గారి పనితీరు ఉంది. దేశీయ టెక్నాలజీతో బుల్లెట్ వేగంతో పరిగెత్తే వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చి అగ్ర దేశాలకు భారత్ తీసిపోదు అని నిరూపించారు మన మోదీ గారు

    - ఆదిత్య రెడ్డి,చిత్తూరు